prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 9:25 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సి ఆర్ డి ఏ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నవీన్ కి పంచాయతీ అధికారులకు భారీగా ముడుపులు.

ప్రజావాణి న్యూస్ (మే09) విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కొనసాగుతున్న బిల్డర్ సతీష్ అక్రమ నిర్మాణాలు ముక్కున వేలేసుకున్న పంచాయితీ అధికారులు గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డులో వాటర్ ట్యాంక్ ప్రాంతంలో బిల్డర్ సతీష్ భారీ అక్రమ నిర్మాణం చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణానికి సెట్ బ్యాక్ వదలకుండా నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణం చేపడుతున్న బిల్డర్ సతీష్ వద్ద భారీగా ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది.ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే పంచాయతీ అధికారు లు నోటీసులు ఇస్తారు లేదంటే అక్రమ నిర్మాణం అడ్డు కుంటారు. ఇక్కడ అలాంటివి ఏమీ జరగడం లేదు ఎందుకంటే స్థానికంగా ఉన్న బిల్డర్ సతీష్ వద్ద నుండి భారీగా ముడుపులు ఏమైనా అందుకున్నారా అని గొల్లపూడి ప్రాంత వాసులు సందేహ పడుతున్నారు. లేదంటే అక్రమ నిర్మాణాన్ని గొల్లపూడి పంచాయతీ వారు అడ్డుకోవాలి కదా వారు ఏమి లంచాలు,తీసుకోకపోతే ఎందుకని గొల్లపూడి పంచాయతీ వారు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదు అనే సందేహం ప్రజల కలుగుతుంది. సిఆర్డిఏ ప్లాన్ 3 స్లాబులకు మాత్రమే ఉండగా4, 5 స్లాబులు అక్రమంగా వేసి ఒక్క ఫ్లోర్ కి రెండు చొప్పున వేసి నాలుగు ఫ్లాట్లు అదనంగా అనుమతులు లేకుండా ప్లాన్ లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టి ఒక్కొక్క ఫ్లాట్ ని సుమారు 50 నుండి 70 లక్షలకు అమ్ముతున్నారు. ఇలా అక్రమ నిర్మాణాలు చేసి కోట్లు గడిస్తున్న బిల్డర్లు వద్ద నుండి ప్రభుత్వ ఆదాయం వచ్చే అవకాశాన్ని సీఆర్డీఏ అధికారులు,పంచాయతీ అధికారులు వాళ్ళ స్వార్థం కోసం డబ్బే ప్రధానంగా పనిచేస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణం పై కొందరు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం