prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:05 am Digital Edition : PRAJA VANI

సిరిసేడు గ్రామం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు <br><br>* గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల  కుమార్ ఆధ్వర్యంలోఅంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించినారు

సిరిసేడు గ్రామం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

* గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల  కుమార్ ఆధ్వర్యంలోఅంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించినారు

జమ్మికుంట ఏప్రిల్ 14 ( ప్రజావాణి)

ఇల్లందకుంట మండలం సిరిసేడు బస్టాండ్ కూడలిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల  కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించికేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్యామల కుమార్  మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడని, ఆయన రచించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి రక్షణగా నిలుస్తుందని తెలిపారుసమాజంలో సమానత్వం సామాజిక న్యాయం సాధించేందుకు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు యువకులు మహిళలు పాల్గొన్నారు.