సిమెంట్ పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి:-CITU డిమాండ్
ప్రజావాణిన్యూస్(మార్చి22)నంద్యాల జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండా మండలంలోని సిమెంట్ పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇప్పటికే కాంట్రాక్టు మామూలుగా పనిచేస్తున్న కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలంలోని కొలిమిగుండ్ల,నాయినిపల్లె,పెట్నీకోట,గోరుమాన్ పల్లె,తుమ్మలపెంట,అంకిరెడ్డి పల్లె, కలవటాల నందిపాడు గ్రామాలలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర కు సీఐటీయూ జిల్లా నాయకులు సుధాకర్ అధ్యక్షతన జరిగింది.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగ రావు సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వి...