prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 11:18 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సిమెంట్ పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి:-CITU డిమాండ్

ప్రజావాణిన్యూస్(మార్చి22)నంద్యాల జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండా మండలంలోని సిమెంట్ పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇప్పటికే కాంట్రాక్టు మామూలుగా పనిచేస్తున్న కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలంలోని కొలిమిగుండ్ల,నాయినిపల్లె,పెట్నీకోట,గోరుమాన్ పల్లె,తుమ్మలపెంట,అంకిరెడ్డి పల్లె, కలవటాల నందిపాడు గ్రామాలలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర కు సీఐటీయూ జిల్లా నాయకులు సుధాకర్ అధ్యక్షతన జరిగింది.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగ రావు సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వి యేసురత్నం,ఏ నాగరాజు,కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్,వీరితో పాటు నంద్యాల జిల్లా నాయకులు ఎల్లయ్య,లక్ష్మణ్,బాల వెంకట్,వెంకటలింగం,శివరాం,సుబ్బయ్య,రామ్ నాయక్,తిరుపతయ్య,నాగమణి,దావీదు,రేణుకదేవీ,పద్మావతీ,సుబ్బారాయుడు,పుల్లారెడ్డి,రామ్మోహన్,రామసుబ్బయ్య తో పాటు 100 మంది సీఐటీయూ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది,గ్రామాలలో పర్యటిస్తున్న పాదయాత్రకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగ రావు గారు మాట్లాడుతూ భారత దేశంలోని భారీ పరిశ్రమలో సిమెంట్ పరిశ్రమ చాలా ముఖ్యమైంది.అన్ని రకాల నిర్మాణాలకు సిమెంట్ కీలకం. సిమెంట్ రంగంలో ముడిసరుకు చౌకగా లభిస్తుంది.సిమెంట్ ఉత్పత్తిలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. గతం కంటే అనేకరెట్లు సిమెంట్ ఉత్పత్తి పెరిగింది.లాభాలు బాగా వస్తున్నాయి.కాబట్టే బడా పెట్టుబడిదారులందరూ ఈ సిమెంట్ రంగంలో ఉన్నారు.గత సంవత్సరం బిర్లా ఆదాయం రూ.4885 కోట్లు, ఇండియా సిమెంట్ రూ.4730 కోట్లు, అల్ట్రా సిమెంట్స్ రూ.51275 కోట్లు,జెకె సిమెంట్స్ రూ.7821 కోట్లు, రామ్కోకు రూ.6010 కోట్లు,శ్రీ సిమెంట్స్ రూ.14843 కోట్లు వగైరా ఆదాయాలు గడించారు.ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానది రెండు వైపులా ఆంధ్రా,తెలంగాణాలో సిమెంట్ పరిశ్రమ భారీగా విస్తరించింది.కానీ సిమెంట్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా వుంది.జూన్ 2023లో సిమెంట్ యాజమాన్యాలు,కార్మిక సంఘాల మధ్య 3 సంవత్సరాల వేతన ఒప్పందం ఢిల్లీలో జరిగింది.పర్మినెంట్ కార్మికులకు ఇ గ్రేడ్లో నెలకు రూ.5870 అదనంగా పెరిగింది.మొదటి రెండు సంవత్సరాలలో ఆఖరి గ్రేడ్ పర్మినెంట్ కార్మికులకు 1.4.2022 నుంచి నెలకు రూ.39572/-లు, 1.6.2023 నుంచి నెలకు రూ.41016/-జీతాలు వస్తాయి.ఈ జీతాలు పర్మినెంట్ కార్మికులకు మాత్రమే వర్తిస్తాయని,పర్మినెంట్ కాని కార్మికులందరూ కాంట్రాక్టు కార్మికులే.ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని కడప, అనంతపురం,నంద్యాల,జగ్గయ్యపేట,పల్నాడు,అనకాపల్లి జిల్లాల్లో సుమారు 40 వేల మంది కార్మికులు ఉన్నారని,వీరికి నెలకు రూ.12వేల నుండి రూ.20 వేల లోపే జీతాలు ఉన్నాయి.స్కిల్డ్ కార్మికులకు కూడా అన్ స్కిల్డ్ జీతాలే ఇస్తున్నారు.శాశ్వత స్వభావం కలిగిన పనులు చేసే వారందరూ పర్మినెంట్ కార్మికులేనని చట్టాలు చెబుతున్నాయి. సిమెంట్ పరిశ్రమ ఉన్నంత కాలం శాశ్వత పనుల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తుంటారు.చట్టప్రకారం ఈ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చెయ్యాలి.వీరు పర్మినెంట్ కానందువల్ల గొర్రె తోక బెత్తెడు లాగా జీతాలున్నాయి.వీరికి ఏ చట్టాలు అమలు చేయడంలేదు.కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చట్టం ప్రకారం చెల్లించాలి. సిమెంట్ కంపెనీల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులను నట్టేట ముంచారు.నిర్వాసితులైన వారికి నేటికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్టు కార్మికులుగానే ఇచ్చారు. ఇది తీవ్ర అన్యాయం.సిమెంట్ కార్మికులను సంఘాలు పెట్టకుండా యాజమాన్యాలు అడ్డుకుంటున్నారు.సంఘాలు పెట్టకుండా యాజమాన్యాలు ఎక్కడైనా సమస్యలు పరిష్కరించారా సంఘాలుపెట్టడం రాజ్యాంగ హక్కు | కార్మికులంతా ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకుంటే సిఐటియు కార్మికులకు అండగా ఉంటుంది.జీవితాంతం కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసి రిటైరయితే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా సిమెంట్ కార్మికులంతా మేలుకోవాలని సిఐటియు కోరుతున్నది. శాస్వత పనుల్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నద ని తెలిపారు అభివందనములతో దర్శనం లక్ష్మణ్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి, నంద్యాల