సిపిఐ సీనియర్ నాయకులు గుండ్లూరు అబ్దుల్ ఖాదర్ మృతి
*సిపిఐ సీనియర్ నాయకులు గుండ్లూరు అబ్దుల్ ఖాదర్ గారు అనారోగ్యంతో బాధపడుతూ,పొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్నటి దినం పరమపదించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన పోరుమామిళ్ల పట్టణంలోని బెస్తవీధిలో ఉన్న వారి స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.* *అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ గారు జీవితాంతం...