సిద్ధవటం – బాగారాపేట వంతెన ప్రమాదకరం: తక్షణమే మరమ్మతులు చేపట్టాలి – బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్.

కడప జిల్లా జూన్ 22ప్రజావాణి బద్వేలు-కడప ప్రధాన రహదారిలోని సిద్ధవటం మరియు బాగారాపేట మధ్య ఉన్న వంతెన (బ్రిడ్జ్) అత్యంత ప్రమాదకరంగా మారిందని,పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల దృష్టికి లేఖ ద్వారా సమస్యను తీసుకెళ్లారు.ప్రతిరోజూ వేలాది వాహనాలు,ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ముఖ్యమైన ప్రధాన రహదారిపై ఉన్న వంతెన నిర్మాణం ప్రస్తుతం చాలా నాసిరకంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.వంతెన పూర్తిగా...