కడప జిల్లా జూన్ 22ప్రజావాణి బద్వేలు-కడప ప్రధాన రహదారిలోని సిద్ధవటం మరియు బాగారాపేట మధ్య ఉన్న వంతెన (బ్రిడ్జ్) అత్యంత ప్రమాదకరంగా మారిందని,పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల దృష్టికి లేఖ ద్వారా సమస్యను తీసుకెళ్లారు.ప్రతిరోజూ వేలాది వాహనాలు,ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ముఖ్యమైన ప్రధాన రహదారిపై ఉన్న వంతెన నిర్మాణం ప్రస్తుతం చాలా నాసిరకంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.వంతెన పూర్తిగా బలహీనపడి ఏ క్షణంలోనైనా కూలిపోయే స్థితికి చేరుకుందని పేర్కొన్నారు.ముఖ్యమైన సమస్యలు ఇవే రక్షణ గోడలు లేవు:వంతెనకు ఇరువైపులా ఎటువంటి సేఫ్టీ వాళ్ళు (Safety Walls) గానీ,రక్షణ కంచె గానీ లేదు.దీనివల్ల రాత్రి సమయాల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు.స్వల్ప అజాగ్రత్త జరిగినా వాహనాలు కింద పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.ముఖ్యమైన సమస్యలు ఇవే:రక్షణ గోడలు లేవు:వంతెనకు ఇరువైపులా ఎటువంటి సేఫ్టీ వాళ్ళు (Safety Walls) గానీ,రక్షణ కంచె గానీ లేదు.దీనివల్ల రాత్రి సమయాల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు.స్వల్ప అజాగ్రత్త జరిగినా వాహనాలు కింద పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.కూలిపోయే స్థితిలో వంతెన నాసిరకం వల్ల పగుళ్లు ఇచ్చి,ముందస్తు మరమ్మతులు చేయకపోతే వంతెన పూర్తిస్థాయిలో కూలిపోయి బద్వేలు-కడప మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది.పెద్ద ప్రమాదం జరిగి,ప్రాణనష్టం సంభవించిన తర్వాత స్పందించడం కంటే,ముందస్తు చర్యగా రోడ్లు & భవనాల శాఖ (R&B) అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించాలని డిమాండ్ చేశారు.వంతెనకు పటిష్టమైన మరమ్మతులు చేపట్టి,రక్షణ గోడలు నిర్మించాలని కోరారు.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనతా వారధి ప్రతినిధి లక్ష్మణ్ రావు,బీజేవైఎం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు