prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 4:22 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

సిద్దిపేట పోలీస్ కమిషనర్,ఎస్ రష్మీ పెరుమాళ్., ఐపీఎస్..

సిద్దిపేట్, ఏప్రిల్ 6, ప్రజావాణి

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (ఏ )నుండి (ఎఫ్ ) మరియు 22 (2) (ఏ ) & ( బి ), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 నో ఐ ఎక్స్ సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం  08-04-2026 ఉదయం 06:00 నుండి 23-04-2026 ఉదయం 06:00 గంటల వరకు అమలులో ఉంటుంది. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సంబంధిత ఏసిపి అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు తేదీ: 08-04-2026 ఉదయం 6 గంటల నుండి తేదీ: 23-04-2026 ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుంది.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 db (ఏ ), 45 డి బి (ఏ ), డి బి (ఏ ), 30 పోలీస్ యాక్ట్ 1861, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించదమైనది. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 223( బి ఎం ఎస్,) సెక్షన్ 70(ఏ ), 70(బి ) 70 సి , 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది..