prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 4:21 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశం గౌడ్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం..

సిద్దిపేట్, ఏప్రిల్ 19, ప్రజావాణి

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో విశేష సేవలు అందించినందుకు గాను సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేశం గౌడ్ రాష్ట్రస్థాయి గుర్తింపును పొందారు.తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌చార్జిగా పనిచేసిన కాలంలో మల్లేశం గౌడ్ చూపిన అద్భుతమైన నాయకత్వ పటిమ, అంకితభావాన్ని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ మరియు ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లల రక్షణ కోసం ప్రాణహితంగా పనిచేసే అధికారుల సేవలు , యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందాలను ఎంతో అభినందనీయమని కొనియాడారు.