సిద్దిపేట పోలీస్ ‘ఉద్యోగ మిత్ర’: ఏప్రిల్ 25న మెగా జాబ్ మేళా-నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం – సమన్వయ కమిటీ సమావేశంలో తేదీ ఖరారు.
సిద్దిపేట్ మర్కుక్, ఏప్రిల్ 14, ప్రజావాణి సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న "సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర" మెగా జాబ్ మేళాకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఈ నెల,ఏప్రిల్ 25వ తేదీన, నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రకటించారు.ఈ మేరకు నేడు మార్కూక్ పోలీస్ స్టేషన్ లో జాబ్ మేళా నిర్వహణపై వివిధ కంపెనీల ప్రతినిధులు మరియు సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాబ్...