సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ యం.సుమన్ కుమార్..స్టేషన్ రికార్డులు, ఈ-చలాన్ ప్రమాదాల రిజిస్టర్ల సమగ్ర పరిశీలన..
సిద్దిపేట్ జూన్ 9, ప్రజావాణి సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఏసీపీ యం.సుమన్ కుమార్, సందర్శించి, సమగ్ర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లో అందుబాటులో ఉన్న వసతులు, సిబ్బంది పనితీరు మరియు రికార్డుల నిర్వహణను ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ తనిఖీ సందర్భంగా ఏసీపీ స్టేషన్ పరిసరాలను, సిబ్బంది హాజరును, ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా స్టేషన్‌కు సంబంధించిన కింది అంశాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు: పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ పరిష్కారాలు,...