సిద్దిపేట జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత
బెజ్జంకి, జూన్ 5(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అనుబంధ గ్రామమైన ఎల్లంపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాలోత్ సంగీతకు అరుదైన గౌరవం లభించింది. సమీకృత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, అలాగే ఉత్తమ వేసవి శిబిరాల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, వేసవి శిబిరాల ద్వారా వారి నైపుణ్యాలను పెంపొందించడంలో ప్రిన్సిపాల్ సంగీత కీలక పాత్ర పోషించినట్లు...