సిద్దిపేటలో వరుస దొంగతనాల ముఠా గుట్టురట్టు– ముగ్గురు నిందితుల అరెస్ట్ ” భారీగా బంగారం, వెండి నగల స్వాధీనం”
సిద్దిపేట, మే 19(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కొమురవెల్లి, బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులు రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను, ఇంటి బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. అదనపు డీసీపీ కుశాల్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు...