సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ సమరశంఖం

*సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ సమరశంఖం* *జీవో 641 రద్దు వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం**అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన పోరాట కమిటీ*షాద్‌నగర్, ప్రజావాణిజూలై 27: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామ ప్రజల ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐతో...