సిగాచి ప్రమాదానికి ఏడాది బాధితులకు న్యాయం చేయాలి మాద్రి పృథ్వీరాజ్

•సిగాచి ప్రమాదానికి ఏడాది... బాధితులకు న్యాయం చేయాలి: మాద్రి పృథ్వీరాజ్   పటాన్‌చెరు, జూన్ 30(ప్రజావాణి): సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి ఏడాది పూర్తైన సందర్భంగా పాశమైలారం బీపీఎల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగి ఏడాది గడిచినా బాధిత కుటుంబాలకు...