సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మెగా ప్లాంటేషన్

జైపూర్ ,జూలై21,ప్రజావాణి:   కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ‘మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ ఉత్పత్తితో దేశ, రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతూనే, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బొగ్గు ఆధారిత ప్లాంట్ల వల్ల జరిగే నష్టాన్ని...