*సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*
* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 7
సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమై, సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సింగరేణి కార్మికులు, కేకే 5 గని కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, విభాగాలలో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియాలోని కేకే గని 5 నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, గనిపై బైఠాయించి, ధర్నా నిర్వహించి, అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గని మేనేజర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గని పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ కుమార్, నాయకులు ప్రేమ్ లాల్, దేవసాని సాంబయ్య, సట్ట కొండయ్య, సాంబ శ్రీకాంత్, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.