గోదావరిఖని, ఆగస్టు 5 ప్రజావాణి :
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా అడిషనల్ సీఎంవోగా బాధ్యతలు స్వీకరించిన డా. ప్రసన్న కుమార్‌ను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌కు పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, డా. ప్రసన్న కుమార్ తన సేవల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈవో మిట్టపల్లి రాజేంద్ర కుమార్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్, ఏఐటియుసి నాయకులు నరహరిరావు, గడమల రాకేష్, రామంచ తిరుపతి, ఎలమర్తి శిరీష్, ఆకునూరి బాలం, ఇరువురాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.