*సింగరేణి అధికారుల డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటం మరింత ఉధృతం*
*మద్దతు తెలిపిన సింగరేణి బిసి అసోసియేషన్*
* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 11
సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని సింగరేణి అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్ తెలిపారు. సింగరేణి అధికారుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల సంఘం ఇచ్చిన నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 13వ రోజుకు చేరుకోగా, నేటి దీక్షలో పలువురు అధికారులు పాల్గొని, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ, సింగరేణి అధికారుల ప్రధానమైన డిమాండ్లైన రెండు సంవత్సరాల పిఆర్పి చెల్లింపులో జాప్యం ,పే అప్గ్రేషన్,ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫీ రియింబర్స్మెంట్ ,అధికారుల పదోన్నతులు, బదిలీ లో పారదర్శకత తోపాటు సింగరేణికి రావలసిన బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు.
సింగరేణి అధికారులు సింగరేణిని తమ సొంత సంస్థగా భావించి, సమయాభావం లేకుండా సింగరేణి అభివృద్ధికి తోడ్పడే అధికారులకు నేడు నిరసనలకు చేసే విధంగా పరిస్థితులు రావడం చాలా బాధాకరమని తెలియజేశారు. సింగరేణిలోని 2500 మంది అధికారులు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గత నెల రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్న యాజమాన్యంలో గాని, ప్రభుత్వంలో గాని ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకా ముందుకు ఇలానే కొనసాగితే సింగరేణి మనుగడకే ప్రమాదకరమని తెలిపారు. వెంటనే సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం తమ డిమాండ్ల పై సరియైన నిర్ణయం తీసుకొని ,పిఆర్పీ వెంటనే చెల్లించేలా పే అప్గ్రేడియేషన్ వెంటనే అమలుపరిచేలా చూడాలని కోరారు. అదేవిధంగా డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగినచో ఈ నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని , సమ్మె కు సైతం వెనుకాడే లేదని స్పష్టం చేశారు. దీక్ష శిబిరాన్ని శనివారం సింగరేణి బిసి అసోసియేషన్ ఏరియా నాయకులు సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, బిసి సంఘం మద్దెల శంకర్, కొట్టె రమేష్, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, అలవాల బాపురావు, గాండ్ల సంపత్, బీమారి వెంకటేష్, అందె శ్రీకాంత్, జితేందర్, సల్ల వెంకటేష్, బి కార్తీక్, ఖాదర్, రామ సాయి కృష్ణ, సందీప్, వివిధ గనుల సభ్యులు పాల్గొన్నారు.