సావిశెట్టిపల్లెలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కడప జిల్లా (మే 20) ప్రజావాణి కాసినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సమ్మర్ స్పెషల్ క్రికెట్ టోర్నమెంట్' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలను వైసీపీ నాయకుడు బండి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ జాతరకు ముందుగా యువత అంతా కలిసికట్టుగా ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల యువతలో క్రమశిక్షణ, ఐక్యత మరియు క్రీడాస్ఫూర్తి పెరుగుతాయని పేర్కొన్నారు....