prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 7:56 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సావిశెట్టిపల్లెలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కడప జిల్లా (మే 20) ప్రజావాణి కాసినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సమ్మర్ స్పెషల్ క్రికెట్ టోర్నమెంట్’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలను వైసీపీ నాయకుడు బండి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ జాతరకు ముందుగా యువత అంతా కలిసికట్టుగా ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల యువతలో క్రమశిక్షణ, ఐక్యత మరియు క్రీడాస్ఫూర్తి పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అనంతరం యువతకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.