సాయి నగర్ యువత బైక్ ర్యాలీ ప్రధానమంత్రి మోడీ సభకు మద్దతుగా ఘన ప్రదర్శన

ఘట్‌కేసర్, మే 10 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా జీహెచ్‌ఎంసీ ఘట్‌కేసర్–పోచారం సర్కిల్ పరిధిలోని 8వ వార్డు అన్నోజిగూడ సాయి నగర్ కాలనీ యువత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సాయి నగర్ నుంచి ఘట్‌కేసర్ మైసమ్మ గుట్ట వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, మాజీ ఎంపీపీ,...