నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) నెల్లూరు సిటీ పరిధిలోని 42 వ డివిజన్ లో సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి ముస్లిం సంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రమైన సామూహిక ఖత్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, చిన్న పిల్లలను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఘనంగా నిర్వహించిన సామూహిక ఖత్నా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మాజీ మంత్రి కాకాణికి ,శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ముస్లిం, మైనార్టీ నేతలు ఇస్లామిక్ సంప్రదాయంలో ఖత్నా అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం అన్న కాకాణి . మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం, మనిషి బాహ్యంగా శుభ్రంగా ఉంటేనే మనస్సు పవిత్రంగా ఉంటుందనే నమ్మకానికి ఇది నిదర్శనం అని పేర్కొన్న కాకాణి.పేద ముస్లిం బిడ్డలకు ఖత్నా కార్యక్రమం నిర్వహించడంతోపాటు మందులు, పౌష్టికాహారాని అందజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు సిద్దిక్ బాయ్ ని అభినందించిన కాకాణి ఆర్థిక స్తోమత లేని పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం.కేవలం నెల్లూరు నుంచే కాకుండా,జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 250 మందికి పైగా పిల్లలు ఈ ఉచిత ఖత్నా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం
మత సామరస్యానికి ప్రతీకగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న ముస్లిం కుటుంబాలలోని చిన్నారులకు అవసరమైన మందులు, పౌష్టికాహారం కిట్లు వంటి అదనపు వసతులను ఉచితంగా అందజేస్తున్న సిద్దిక్ బాయ్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా అండగా ఉంటాందివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి,హయాం నుంచే ముస్లిం కుటుంబాలకు వైఎస్ కుటుంబం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది, జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో సాగుతున్నారు ముస్లిం మైనారిటీ నాయకులు చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యం ఉంటుంది,అందరం కలిసికట్టుగా మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తాం గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కొంత ఇబ్బందికరంగా ఉన్నా,కానీ ఇప్పుడు చిన్నారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏసీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి,వైద్యుల పర్యవేక్షణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం ఇస్లామిక్ సంప్రదాయంలో ఖత్నా అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు,అది ఆరోగ్యానికి మరియు పరిశుభ్రతకు చిహ్నం’శరీరం పవిత్రంగా ఉంటేనే మనసు పవిత్రంగా ఉంటుంది’అనే భావనతో ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం ఈ కార్యక్రమం ముస్లిం వర్గాల పట్ల ఉన్న గౌరవాన్ని,సామాజిక బాధ్యతను చాటిచెబుతోంది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చేసిన సిద్దిఖ్ భాయ్, మరియు సోదరుడు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,అల్లాహ్ దీవెనలు ఆ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా సొంత నిధులతో ప్రతి ఏటా నిర్వహిస్తూపేద ముస్లింలకు సాంప్రదాయ రీతిలో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్న మా సిద్దిక్ బాయ్ కి అల్లాహ్ దీవెనలు ఎల్లవేళలా ఉండాలని,పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలిచే శక్తి,స్థాయి,భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నా