సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ప్రజాస్వామ్య పర్యవేక్షణకు దూరం చేసే సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలి,బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప డిమాండ్.
కడప జులై 28 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ 07-04-2026న జారీ చేసిన హాస్టళ్లలో అనధికార ప్రవేశాల నివారణ సర్క్యులర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప తీవ్రంగా ఖండించారు.హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, గోప్యతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అయితే ఆ పేరుతో మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు జిల్లా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా హాస్టళ్లలోకి...