సల్లగా చూడు మైసమ్మ తల్లి.. ఘనంగా మైలారంలో బోనాల జాతర
సల్లగా చూడు మైసమ్మ తల్లి.. ఘనంగా మైలారంలో బోనాల జాతరవేలాది భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం.. మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డినస్రుల్లాబాద్, ఆగస్టు 6 (ప్రజావాణి): నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో కొచ్చరి మైసమ్మ తల్లి బోనాల జాతరను గ్రామస్తులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డీజే పాటలు, యువత కేరింతలతో గ్రామ వీధులు ఉత్సాహభరితంగా మారాయి. మహిళలు తొట్టెల బోనాలతో పెద్ద సంఖ్యలో...