prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 3:16 pm Digital Edition : VENU THIRUMALAYAPALEM

సయ్యద్ యూసఫ్ కు వీడ్కోలు కార్యక్రమం.

తిరుమలాయపాలెం, ప్రజావాణి:

విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్‌గా సేవలందించిన శ్రీ సయ్యద్ యూసఫ్ పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నేడు బచ్చోడు గ్రామంలో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం.సుమారు 39 సంవత్సరాల పాటు విద్యుత్ శాఖలో విధులు నిర్వహించిన సయ్యద్ యూసఫ్ తన సేవా కాలంలో నిబద్ధతతో పని చేసి సహోద్యోగుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన తోటి ఉద్యోగులు ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొని సయ్యద్ యూసఫ్ ని సన్మానించి, ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.