prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 9:35 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సత్యవేడులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.

చిత్తూరు జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)సత్యవేడు పూలమాలలు వేసి నివాళులర్పించిన టిడిపి మండల అధ్యక్షుడు పరుచూరి శివకుమార్,మండల నాయకుడు కూరపాటి చంద్రశేఖర్ రెడ్డి.ఈరోజు సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు పరుచూరి శివకుమార్ సత్యవేడు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.వీరు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలతో,సమానత్వమే ఊపిరిగా నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు అని స్మరిస్తూ, అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి మండల నాయకుడు కూరపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎందరో జీవితాలలో మార్పునకు స్పూర్తి ప్రదాత,సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు.సత్యవేడు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్న మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండూరు బాలరాజు,పరమశివమ్,శివన్న,రాధన్న,మురళి అలియాస్ కోళ్ల చిన్న,సీమోన్,తులసిరామ్,కోటిరెడ్డి,వెలాయుధం,కొనయ్య,పామాంజి వాసు,ఆది భాస్కర్,అన్బు,కిషోర్,వెట్టి డేవిడ్,దయ,శరత్ ముదిరాజ్,గురునాధం,వాసు,గోవిందస్వామి, కార్తి,స్థానిక టీడీపీ నాయకులు,యువ నాయకులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.