











సత్తా చాటిన విద్య జూనియర్ కళాశాల.
చిత్తూరు ఏప్రిల్ 16 ప్రజావాణి: ఇంటర్ ఫలితాల్లో విద్య జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల కరస్పాండెంట్ డా.పి. నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక చిత్తూరు పట్టణం నందు కొంగారెడ్డి పల్లెలో ఉన్న కళాశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా విద్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ డా. పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ వెలువడిన ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించారని జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ప్రణయ శ్రీ 433 మార్కులు, బైపీసీలో హేమలత 427 మార్కులు, ఎల్ ఎం డి లో శిరీష 482, లాసియ 479, కార్తీక్ 475, సి. ఎస్.ఈ గ్రూపులో వర్షిత్ 437 మార్కులు, ఎం పి హెచ్ డబ్ల్యు లో హంస 461 మార్కులు, రూబీ 444, చంద్రిక 437, సీనియర్ ఇంటర్ బైపీసీలో మైకేల్ జాన్సన్ 925 మార్కులు, ఎల్ఎండి లో వైష్ణవి 941, ఎం పి హెచ్ డబ్ల్యు లో కావ్య 922, మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషిచేసిన అధ్యాపక బృందానికి,మరియు విద్యార్థిని విద్యార్థులకు, అలాగే యాజమాన్యానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి. నవీన్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రదీప్ అభినందనలు తెలిపారు.