సచివాలయం తెరిచి… అధికారులు గైర్హాజరు..! ప్రజలకు సేవలెక్కడ..
వైఎస్సార్ కడప జిల్లా(జూన్ 06) ప్రజావాణి కమలాపురం మండలం టి.చదివిరాళ్ల గ్రామ సచివాలయంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గ్రామ ప్రజలు అవసరమైన పనుల కోసం ఉదయం 11 గంటలకు వెళ్లినా, సాయంత్రం 4 గంటలకు వెళ్లినా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది.అధికారులు లేకపోయినా సచివాలయం తలుపులు తెరిచి ఉండటం,ఫ్యాన్లు యథావిధిగా తిరుగుతుండటం, లోపల ఎవరూ లేకపోయినా విలువైన వస్తువులు అలాగే వదిలి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయంలో అధికారులు ఎప్పుడు...