సచివాలయం కళ్లెదుటే.నరకకూపంగా‘రంగసముద్రం!చెత్త కుప్పలు..పందుల స్వైరవిహారం!అధికారుల ముక్కుల ముందే అస్తవ్యస్త పారిశుధ్యం.స్థానికుల తీవ్ర ఆగ్రహం!
పోరుమామిళ్ల,జూన్ 24ప్రజావాణి (రంగసముద్రం పంచాయతీ) ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి,గ్రామాలను ప్రగతి పథంలో నడపడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన'గ్రామ సచివాలయం'వ్యవస్థ ఆశయాలు ఇక్కడ నీరుగారిపోతున్నాయి.వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో పాలకుల,అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఈ దారుణ దృశ్యం.గ్రామ సచివాలయం కార్యాలయానికి కూతవేటు దూరంలో,సమీపంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది.నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగే ప్రధాన కూడలిలోనే ఈ దుస్థితి ఉండటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. అధికారుల ముక్కుల ముందే పందుల సామ్రాజ్యం! ప్రభుత్వ కార్యాలయం పక్కనే...