సగిలేరు వాగులో అక్రమ మట్టి మాఫియా డీకేటీ భూముల్లో నిబంధనలకు పాతర.నిమ్మకు నీరెత్తిన అధికారులు*
కాశినాయన(ఆగస్టు 4 ప్రజావాణి ) మండలంలో ఇసుక, మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. సగిలేరు డ్యామ్‌కు సంబంధించిన వాగు పరివాహక ప్రాంతంలో, వివేకానంద ఆశ్రమం వెనుక భాగంలో జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, పగలు రేయి తేడా లేకుండా యంత్రాలతో మట్టిని తరలిస్తుండటంతో ప్రకృతి సంపద పూర్తిగా ధ్వంసమవుతోంది, డీకేటీ భూముల్లో తవ్వకాలు. పర్మిషన్ ఎక్కడ ? అక్రమ త్రవ్వకాలు జరుగుతున్న సదరు భూమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘డీకేటీ’ (ధారఖాస్తు...