ప్రజావాణి న్యూస్ (మార్చి29)కాశినాయన:మండల కేంద్రమైనా నరసాపురంలోని హిందూస్తాన్ పబ్లిక్ స్కూల్ నందు ఆదివారం కాశినాయన మండల బీజేపీ ఆధ్వర్యంలో కాశినాయన మండల బీజేపీ మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి,భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పండిట్ దినదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి,మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షకీల బేగం మాట్లాడుతూ కార్యకర్తలకు సమగ్ర మార్గదర్శనం చేస్తూ,పార్టీ సిద్ధాంతాలు,కార్యాచరణ,ప్రజా సేవా దృక్పథంపై అవగాహన కల్పించారు.పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ,నిబద్ధతతో,సేవాభావంతో పనిచేస్తేనే పార్టీ బలపడుతుందని,ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు.గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ బలపడటానికి శిక్షణ తరగతులు అత్యంత కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమానికి మండల స్థాయి నాయకులు,పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి,ప్రతి లబ్ధిదారునికి చేరేలా ఎలా పని చేయాలన్న దానిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.పార్టీ బలోపేతం,బూత్ స్థాయి నిర్వహణ,ప్రజలతో మమేకం కావడం,కేంద్ర పథకాల ప్రయోజనాలను వివరించడం వంటి అంశాలపై నేతలు ప్రసంగించారు.అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు క్రమశిక్షణతో,సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా ఆర్ఎస్ఎస్ ఖoడ కార్యవాహ చరణ్ కుమార్ రెడ్డి,బద్వేల్ రూరల్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి సుబ్బారెడ్డి,బిజెపి మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి,బిజీవేముల భాస్కర్ రెడ్డి,పోలేరు,మాధవ్,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.