prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 11:47 am Digital Edition : NARESH HUZURNAGAR

సంగారెడ్డిలో అటవీ శాఖ వసతి గృహ ప్రారంభోత్సవం

*సంగారెడ్డిలో అటవీ శాఖ వసతి గృహ ప్రారంభోత్సవం*

*రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండ సురేఖ సంగారెడ్డి జిల్లా పర్యటన*

*మన సమగ్ర ప్రజావాణి మే 25 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి*

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 32 లక్షల 23 వేల రూపాయల కంపా నిధులతో నిర్మించిన అటవీ శాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను ప్రారంభించారు.

అనంతరం, ఒక 1కోటి 44 లక్షల రూపాయల సి ఎ – పి డి నిధులతో నిర్మించిన జిల్లా పరిరక్షణ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అడవుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జిల్లాలో అందులో భాగంగా అర్బన్ ఎకో పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ లలో అర్బన్ ఎకో పార్కులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో అటవీశాఖ జిల్లా సంరక్షణ అధికారి కార్యాలయాన్ని నిర్మించామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి సువర్ణ, పిసిసిఎఫ్ ప్రియాంక వర్గీస్, TGIIC చైర్ పర్సన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరతోష్ పంకజ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ వనిత సంతోష్, సదాశివ పేట చైర్ పర్సన్ అంజమ్మ సత్యనారాయణ, జిల్లా అటవీ శాఖ సంరక్షణ అధికారి ప్రసాద్ రెడ్డి, డి ఏస్ పి సత్తయ్య,
ఎఫ్ ఆర్ ఓ దేవీలాల్ , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.