prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:55 pm Digital Edition : GIRIBABU KONDHURG

షాబాద్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేత

*వేతనాలు విడుదల చేయాలని వి‌బి‌జి రాంజీ ఎఫ్‌టీఈ ఉద్యోగుల నిరసన*

 

*పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్*

 

*పే స్కేల్ పెంపు, క్యాడర్ స్ట్రెంత్, పదోన్నతులు, బదిలీల అమలుకు విజ్ఞప్తి*

 

షాబాద్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేత

 

ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా షాబాద్ మండలంలోని వి‌బి‌జి రాంజీ ఎఫ్‌టీఈ ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పే స్కేల్‌ను పెంచాలని, క్యాడర్ స్ట్రెంత్‌ను ఖరారు చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ… చాలాకాలంగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలను చెల్లించడంతో పాటు పే స్కేల్ సవరణ, పదోన్నతులు, బదిలీల అంశాలను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం తమ సమస్యలను వివరిస్తూ షాబాద్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో వి‌బి‌జి రాంజీ ఎఫ్‌టీఈ ఉద్యోగులు, ఏపీవో వీరా సింగ్, శారద, పవన్, శివకుమార్, సుధాకర్,సంఘ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.