శ్రీ సాయి విద్యానికేతన్ (నోబెల్ స్కూల్)లో విద్యార్థులకు పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు
ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేల్ మునిసిపల్ కమీషనర్ శ్రీ వి.వి.నరసింహ రెడ్డి గారి ఆధ్వర్యంలో,AIILSG సంస్థ సాంకేతిక సహకారంతో స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలోని శ్రీ సాయి విద్యానికేతన్ (నోబెల్ స్కూల్)లో విద్యార్థులకు పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది.ఈ సందర్భంగా విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థాల వర్గీకరణపై వివరించి,ఎరుపు, ఆకుపచ్చ,నీలం రంగు డస్ట్ బిన్‌ల వినియోగంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.అలాగే తడి చెత్త నుండి ఎరువు తయారీ, పొడి చెత్త రీసైక్లింగ్ ప్రాముఖ్యతను...