ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేల్ మునిసిపల్ కమీషనర్ శ్రీ వి.వి.నరసింహ రెడ్డి గారి ఆధ్వర్యంలో,AIILSG సంస్థ సాంకేతిక సహకారంతో స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలోని శ్రీ సాయి విద్యానికేతన్ (నోబెల్ స్కూల్)లో విద్యార్థులకు పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది.ఈ సందర్భంగా విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థాల వర్గీకరణపై వివరించి,ఎరుపు, ఆకుపచ్చ,నీలం రంగు డస్ట్ బిన్‌ల వినియోగంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.అలాగే తడి చెత్త నుండి ఎరువు తయారీ, పొడి చెత్త రీసైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించారు.మునిసిపల్ కమీషనర్ గారు మాట్లాడుతూ, పరిశుభ్రత ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని విద్యార్థులు చిన్నప్పటి నుండే చెత్త వర్గీకరణ అలవాటు చేసుకొని, సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో బద్వేల్ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలపడానికి విద్యార్థుల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు.AIILSG ప్రతినిధులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని,సరైన డస్ట్ బిన్ వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతుందని తెలిపారు.ప్రతి విద్యార్థి ‘స్వచ్ఛ వారధి’గా మారి సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు.పరిశుభ్రమైన బద్వేల్ కోసం విద్యార్థులు తమ ఇళ్లలో మరియు పాఠశాలలో స్వచ్ఛతను పాటించేందుకు ప్రతిజ్ఞ చేశారు