prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 9:09 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

శ్రీ వేణుగోపాలస్వామి నూతన ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నూతన ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్షుని గా బిసగోని సత్యం గౌడ్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 09 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం రోజున స్థానిక సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ కమిటి నూతన అధ్యక్షుని గా బిసగోని సత్యం గౌడ్ ను, ఉపాధ్యక్షుని గా జెల్లెల కనకయ్య, కోశాధికారిగా గోనె సంతోష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కాంపల్లి సంపత్, ప్రచార కార్యదర్శిగా ద్వావ రాజ్ పాల్, ప్రచురణ కర్త గా చుంచు భూమయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ….. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు, స్వామి వారి కరుణాకటాక్షాలతో ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ… వారిపై నమ్మకం ఉంచి ఆలయ బాధ్యతను అందజేసినందుకు సర్పంచ్ మల్లేష్ గౌడ్ కు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరిగేలా జయవ్వ రవి, వార్డు సభ్యులు పాలకుర్తి తిరుపతి, చెన్నెళ్ళ వేణు, మడ్డి సౌజన్య మహేష్, బిసగోని అంజలి తిరుపతి, గౌరి చంద్రమౌళి జైనపురం తిరుపతి, ఓరగంటి లావణ్య నగేష్, జక్కుల మల్లేశ్వరి స్వామి మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్, మాజీ ఉపసర్పంచ్ బిసగోని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూసారపు భూమయ్య గౌడ్, గోనె తిరుపతి, గోనె సురేష్, గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.