శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంను సందర్శించిన
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
* పిల్లలతో సరదా కాసేపు వాలీబాల్ ఆడారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఎంతో అవసరమని
జమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం సందర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం దృశ్య త్రాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే దోమల వల్ల పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి చుట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి పిల్లల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని బ్లీచింగ్ దోమల నివారణ చర్యలు తీసుకోవాలని అలాగే పిల్లలకు ప్రేమతో కూడిన విద్యను అభ్యసించాలని పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా మంచి విద్యను అభ్యసించాలని తెలుపుతూ పిల్లలతో సరదా కాసేపు వాలీబాల్ ఆడారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలుపుతూ పిల్లలకు మీ యొక్క తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాతకాల అనిల్ శంకర్ కొమ్ము నరేష్,శ్రీనివాస్ అనిల్ కౌశిక్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు

