శ్రీశైలం దేవస్థానంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

శ్రీశైలం దేవస్థానంలో వైభవంగా స్వర్ణరథోత్సవంనంద్యాల జిల్లా, శ్రీశైలం, ఏప్రిల్ 22 (ప్రజావాణి):ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో ఈరోజు శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం వేకువజామునే ఆరుద్రోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.అనంతరం ఆలయ అర్చకులు దేశ శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేకంగా సంకల్పం చేశారు. దేశంలో అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల...