

శ్రవణ్ మరణంతోనైనా దుద్దిల్ల కుటుంబం కళ్లు తెరువాలే…
-రెండున్నర ఏండ్లైనా ఇద్దరికి ఉద్యోగాలు ఇయ్యలే.
-నలభై ఏండ్లుగా మోసం చేస్తుండనే మానీఫెస్టో కమిటి చైర్మన్ చేసిండ్లు.
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
ముత్తారం,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 10
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి తొలగించడంతో తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన మారెల్లి శ్రావణ్ మరణంతోనైనా దుద్దిల్ల కుటుంబానికి కళ్లు తెరువాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హితవు పలికారు.ఓడేడ్ గ్రామంలో జరిగిన మారెల్లి శ్రావణ్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ మానీఫెస్టో రాసినప్పుడు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చి రెండున్నర ఏండ్లు గడిచినా రెండు ఉద్యోగాలు ఇయ్యకుండా పిల్లల చావులకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు నుంచి తీసివేస్తుంటే చూస్తున్నారే తప్ప ప్రత్నామ్నాయ ఆలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ కుటంబానికి పది సాఫ్టవేర్ కంపెనీలు లీగల్‌గా ఉన్నాయని,ఇల్లీగల్‌గా ఎన్ని ఉన్నయో తెలియదని, రెండేళ్లుగా మంథని, కాటారంలో రెండు ఐటీ కంపెనీలు పెట్టి ఇక్కడి పిల్లలకు ఉద్యోగాలు పెట్టించుమని వేడుకుంటుంటే ఒక్క కంపెనీనీ మంథనికి తీసుకురాకుండా పిల్లల చావులకు కారణమయ్యారని,ఈ విషయాన్ని అనేక మార్లు చెప్తున్నా సమాజానికిఅర్థం కావడం లేదన్నారు.బతికుంటే ఓటుగా వాడుకుంటాడని, చనిపోతే దేవుడికి అప్పజెప్తడే తప్ప ప్రజలను ప్రేమించడని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు.నలభై ఏండ్లుగా దుద్దిల్ల కుటుంబం మంథని నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ ఓట్లతో గెలుస్తున్నడు కనుకనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా అవకాశం ఇచ్చిందని, నియోజకవర్గ ప్రజలను ఎలా మోసం చేస్తున్నవో అలాగే రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మానీఫెస్టో రాయమంటే అద్బుతంగా మానీఫెస్టో రాసి యావత్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చరిత్ర దుద్దిళ్ల శ్రీధర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. శ్రవణ్ మరణం ప్రభుత్వ అనాలోచితంగా ముందుకు పోతున్న క్రమంలోనే జరిగిందని బావిస్తున్నానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం,సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గం రాష్ట్రం గురించి ఆలోచన చేయడంలేదని ఎంతసేపు రాహుల్ గాంధీకి నోట్ల సంచులు ఇయ్యాలే అని ఇక్కడి డబ్బులు ఎలా చేరవేయాలని ఆలోచన చేస్తుండ్లన్నారు.మనం అనుకుంటే ఐదు నిమిషాల్లో వేయి కోట్లు గాంధీ కుటుంబానికి ఇవ్వచ్చు అని స్వయంగా సీఎం అంటున్నాడని అన్నారు. సంచులు అప్పజెప్పడానికి చూపించే శ్రద్ద ప్రజల బాగోగుల గురించి చూపించడంలేదన్నారు. దుద్దిళ్ల కుటుంబానికి ఇక్కడ ప్రజల ఓట్లతోనే పది ఐటీ కంపెనీలు, పదవులు వచ్చినాయని,వేల కోట్లు సంపాదించుకున్నరని,పిల్లల ఉద్యోగాలు ఎవరి భవిష్యత్ గురించి ఆలోచన చేయడంలేదన్నారు.ఓట్లు వస్తే నోట్ల సంచులతో వస్తున్నరని, శ్రవన్ మరణంతో దుద్దిళ్ల కుటుంబం కళ్లు తెరువలన్నారు.లేకపోతే ప్రజలను చైతన్యపరుస్తమని, ఓటు విలువ తెలియజేస్తమన్నారు.