prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:37 am Digital Edition : PRAJA VANI

శేషాద్రి నగర్ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్  ప్రజలకు సుఖశాంతులు కలగాలని అమ్మవారిని ప్రార్థన

కొండాపూర్, ఆగస్టు 2 (ప్రజావాణి):
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని శేషాద్రి నగర్ కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల మహోత్సవాలకు చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శేషాద్రి నగర్ కాలనీ అధ్యక్షుడు నాగభూషణం ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం బోనాల ఉత్సవాల విశిష్టతను వివరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విట్టల్, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, దేవేందర్, పీఏసీఎస్ చైర్మన్ పవన్ కుమార్, ప్రశాంత్ మైపాల్‌తో పాటు కాలనీ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల వేడుకలు భక్తిప్రపత్తులతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగాయి.