శీతల పండుగ వైభవం.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన కట్రీయాల్ తండా వాసులు
శీతల పండుగ వైభవం.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన కట్రీయాల్ తండా వాసులు రామాయంపేట మండలం, కట్రీయాల్ తండా: బంజారా సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శీతల పండుగను రామాయంపేట మండలంలోని కట్రీయాల్ తండా వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే తండా మొత్తం పండుగ శోభతో కళకళలాడింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సంప్రదాయ బంజారా వస్త్రధారణలో పాల్గొని శీతల అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలందరూ...