prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 9:03 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో *వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

గార్లదిన్నె జూలై 08 ప్రజావాణి,పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు వైఎస్ఆర్  77వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నాయకులు ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనతరం, నాయకులందరూ కలిసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి,అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా శైలజనాథ్ తనయుడు డాక్టర్ సాకే రిత్విక్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలను గుర్తు చేశారు.”రైతులకు ఉచిత విద్యుత్తు, ఫీజు రియంబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలతో పాటు పేదవారి కళ్ళల్లో ఆనందాన్ని నింపి,వారి కన్నీటిని తుడిచిన మహనీయుడు వైఎస్ఆర్”అని కొనియాడారు. ఆయన వంటి గొప్ప నాయకుడి ఆశయాలను జగన్ నెరవేర్చారని వైఎస్ఆర్  ఆశయాలు నెరవేరాలంటే మళ్లీ జగనన్న అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు నారాయణ రెడ్డి,బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి,గార్లదిన్నె మండలం కన్వీనర్ ఎల్లారెడ్డి,సింగనమల నియోజకవర్గం బూత్ కన్వీనర్ ఓబిరెడ్డి,సుధాకర్ రెడ్డి.రామోహన్ రెడ్డి.గార్లదిన్నె మండల బూత్ కన్వీనర్ సుంక్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి,ఎంపీపీ వెంటనారాయణ,పుల్లారెడ్డి,చీమల సీనా,అనిల్ కుమార్ రెడ్డి,తాతి రెడ్డి,నారాయణ,ఆది,షారోన్ రఘు,రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.జోహార్ వైఎస్సార్