prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 10:11 am Digital Edition : PRAJA VANI

శాయంపేట మండలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పూర్తిచేయాలని బహుజన సంక్షేమ సంఘం<br> ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి వినతి పత్రం

ప్రజావాణి శాయంపేట

మండలంలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మరియు మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం శంకుస్థాపన, మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ మరియు 108 సిబ్బంది కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని మండలంలో ఉన్న బెల్టు షాపులను మూసివేయాలని ఎమ్మెల్యేకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేయాలని ఆ దిశగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని తెలపడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కావస్తుంది ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం బాధాకరమని తెలిపారు. ఇట్టి విషయాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  స్పందించారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతి కుమార్,  మొగ్గం సుమన్, మారేపల్లి విజయ్ కుమార్, శాయంపేట మండల అధ్యక్షులు మారెపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.