శానబండలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు
పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు పశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్న సర్పంచ్ భాస్కర్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 16 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని శానబండ గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా గ్రామంలోని 43 ఆవులు, ఎడ్లకు అలాగే 26 గేదెలకు పశువైద్య సిబ్బంది టీకాలను వేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గాదం భాస్కర్ మాట్లాడుతూ.... పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల నివారణకు...