*శాఖహార అవశ్యకతపై భారీ ర్యాలీ*
* *మన ప్రజావాణి*, మందమర్రి:- జూలై 1
శాఖహార అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆచార్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి రామన్ కాలనీ మీదుగా మార్కెట్ ఏరియా వరకు ప్రభంజన భారీ ర్యాలీ శాఖాహారమే సంపూర్ణ పోషకాహారం అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్ర నిర్వాహకులు ఆచార్య శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ, జీవహింస వలన మానవాళికి భవిష్యత్తులో రక్షణ లేకుండా పోతుందని, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. మనుషులందరూ జీవ హింస మానుకొని, కేవలం శాఖాహారానికి పరిమితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాకాహారప్రియలు, ప్రజలు పాల్గొన్నారు.