వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన రైతు సంగ పోషయ్య (40), తన పొలం వద్ద బావిలో పడి మృతి చెందాడు. బుధవారం ఉదయం మోటారును బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటిలో పడిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింట్లు ఎస్సై పి ఉదయ్ కుమార్ తెలిపారు.