వ్యవసాయ కూలీలకు రోజుకు ₹600 వేతనం,200 రోజుల పని కల్పించాలి: తిమ్మిడి హనుమంతరావు
తిరుమలాయపాలెం, ప్రజావాణి: వ్యవసాయ కూలీలకు రోజుకు ₹600 వేతనం ఇవ్వడంతో పాటు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని దినాలు కల్పించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు డిమాండ్ చేశారు.తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం గోకినపల్లి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఉపాధి హామీ కూలీల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం ద్వారా వ్యవసాయ...