వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలి: పగడాల వెంకటరామిరెడ్డి, ప్రసాద్ ధ్వజం..

వినకొండజూలై 03 ప్రజావాణి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను, అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని (వైసీపీ) రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి,ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్,తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వినుకొండలో శుక్రవారం వైసీపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ...