prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 8:42 am Digital Edition : PRAJA VANI

వొడితెల రాజేశ్వర్ రావు వర్ధంతి సందర్బంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ<br>

వొడితెల రాజేశ్వర్ రావు వర్ధంతి సందర్బంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

* ఆలయ చైర్మన్  అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్

జమ్మికుంట జిల్లా 24 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో 76 వ శుక్రవారం అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో హుజురాబాద్ సింగపూర్ ముద్దుబిడ్డ
మాజీ రాజ్యసభ సభ్యులు వొడితెల రాజేశ్వరరావు  వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించి,అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్  అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతు వొడితెల రాజేశ్వర్ రావు పేదప్రజలకోసమే తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసినారని ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు సేవలు అందించినారని వారిని స్మరించుకుంటు ఈ రోజు పెద్దమ్మ తల్లి గుడి అన్న ప్రసాద వితరణను నిర్వహించామని
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఆలయంలో ఎలాంటి పేపర్ ప్లేట్లు గాని డిస్పోజలు గ్లాసులు గాని వాడకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, మోదుగాకుల విస్తార్లలో భోజనాలు వడ్డిస్తున్నామని తెలియజేసినారుఅనంతరం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళాబృందం వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారుఈ అన్న ప్రసాద వితరణలోపాల్గొనాలనుకునేవారు మా ఫోన్ నెంబర్లు
9908440540 9989737010 సంప్రదించగలరని అన్నారుఈ కార్యక్రమంలో అమ్మఫౌండేషన్ అద్యక్షులు ఆలయ చైర్మన్ టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అద్యక్షులు గోనెలసమ్మన్నముదిరాజ్,మల్లారెడ్డిపల్లి కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ కర్రె నర్సయ్య,
దూలం కనుకయ్య, కొలిపాక ఎల్లయ్య, అమ్మ ఫౌండేషన్ సభ్యులు కాంతాల సంపత్ రెడ్డి,
కర్రె వెంకట స్వామి, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు.